Top News

SP Rajesh Chandra | గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర

టెక్రియాల్ చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆరా - పోలీసులకు దిశానిర్దేశం

కామారెడ్డి, సెప్టెంబర్ 23: కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం పరిశీలించారు.

పట్టణంలోని కల్కి గణేష్ మండలి, ఏకదంత గణేష్ మండలి, శివసేన గణేష్ మండలి, పాన్ చౌరస్తాలోని బాల గణేష్ మండపాలను ఆయన సందర్శించారు. గణేష్ విగ్రహాలను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, విగ్రహాలను నిమజ్జనానికి తరలించే విధానం, భక్తుల రద్దీ తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మండపాల వద్ద ఉన్న చిన్నారులతో ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి సెల్ఫీలు దిగారు. వేడుకలను ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు.

అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, గజ ఈతగాళ్ల అందుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, టౌన్ ఎస్హెచ్ఓ బి. నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, పోలీసు సిబ్బంది, గణేష్ ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.










Post a Comment

Previous Post Next Post