Top News

Minister Uttam's Visit | 10న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభానికి సిద్ధం  

రూ.106 కోట్లతో నిర్మించిన పథకాలు  

ఈనెల 10న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం  

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు  

తెలంగాణ డైలీ న్యూస్, వర్ని, జూన్ 8: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం ఈనెల 10వ తేదీ బుధవారం జరగనుంది. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను కూడా మంత్రి పరిశీలించనున్నారు.  

ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఏర్పాట్లను పరిశీలించారు.  

హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.  

ఈ సందర్భంగా వర్ని, చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post