Top News

Prajavani | కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి  

65 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 8: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.  

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 65 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

అర్జీదారులు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్‌వి గిరి, డీఆర్ఓ పాండు, జడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post