MLA KVR | దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోదీ సొంతం

దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోదీ  సొంతం  

అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి


తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 12: ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు సొంతం చేసుకున్నారని, ఆయనే దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని అని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.   నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ను విశ్వ గురువుగా నిలబెట్టడమే ప్రధాని మోదీ సంకల్పమని, అందుకోసం ఆయన అహర్నిశలు పాటు పడుతున్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని పాలనపై ప్రశంసలు  

దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాల్లో భారత్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.



కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కామారెడ్డి నియోజకవర్గం లోని దోమకొండ, బీబీపేట, రాజంపేట, కామారెడ్డి  పట్టణానికి చెందిన షాది ముభారక్ లబ్ధిదారులకు ఆయా మండలాల్లో,   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చెక్కుల పంపిణీ చేశారు.


Post a Comment

أحدث أقدم