Top News

PBR Request | వర్నిలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

 


వర్నిలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన  

సిద్దపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన, ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం  

నాయకులకు ఆహ్వానం  : పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  

కార్యక్రమాల షెడ్యూల్  

ఉదయం 9 గంటలకు వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు జాకోర మరియు చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు.  

హాజరుకానున్న ప్రముఖులు  

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొననున్నారు.  

నాయకులకు ఆహ్వానం  

బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు.



Post a Comment

Previous Post Next Post