Top News

Police Cordon Search | బాన్సువాడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్

బాన్సువాడ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్  

159 బైక్‌లు, 31 ఆటోలు స్వాధీనం, పత్రాలు చూపితేనే అప్పగింత  

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకే సెర్చ్: డీఎస్పీ విటల్ రెడ్డి  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 06: పట్టణంలోని తార్కోల్ రోడ్డు వద్ద గల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో డీఎస్పీ విటల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సైలు, 60 మంది పోలీసు బలగాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.  ఈ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మొత్తం 1000 ఇళ్లు ఉండగా సుమారు 500 పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.  (Video 👇)


ఆర్‌సీ బుక్‌లు లేని వాహనాలు స్వాధీనం  

తనిఖీల్లో కొన్ని వాహనాలకు ఆర్‌సీ బుక్‌లు లేకపోవడం, మరికొన్ని బినామీ పేర్ల మీద ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 151 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు అందిస్తే వాటిని యజమానులకు అప్పగిస్తామని తెలిపారు.  








ఇంటింటికీ వెళ్లి ఆధార్ తనిఖీ  

పోలీసులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి లబ్ధిదారుల ఆధార్ కార్డులను చెక్ చేశారు. ఇరుగుపొరుగువారు ఎవరైనా మద్యం సేవించి ఇబ్బందులు గురిచేస్తున్నారా, మహిళలను వేధిస్తున్నారా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారా, గంజాయి వినియోగిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.  గ్యాస్ బుక్ లేకుండా సిలిండర్ పెట్టుకున్న వారి నుంచి సిలిండర్లను సీజ్ చేశారు.  

కాలనీవాసులతో పోలీసుల ముఖాముఖి  

డీఎస్పీతోపాటు సీఐలు, ఎస్సైలు కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేరస్తులు ఎవరైనా కాలనీలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారా అని ఆరా తీశారు.  

పోలీసుల తనిఖీతో మహిళలు హర్షం  

పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించడంతో కాలనీలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల తనిఖీల వల్ల కాలనీలో ప్రశాంతత నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. 




● ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

● బాన్సువాడ లోని తాడ్కోల్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విస్తృత తనిఖీలు

● ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు

● ప్రజల సంరక్షణ, భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల నిర్వహణ

● 159 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, 3 కార్లు స్వాధీనం

ప్రజల రక్షణ, సంరక్షణను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర  ఆదేశాల కమ్యూనిటీ కాంటాక్ట్ (Cordon & Search) కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువపత్రాలు లేని 159 ద్విచక్ర వాహనాలు, 31 ఆటోలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు వంటి సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కాలనీకి మంచి పేరు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే విద్యాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలు అసాంఘిక కార్యకలాపాల బారిన పడకుండా పర్యవేక్షించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, ముఖ్యంగా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు.

నంబర్ ప్లేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రశాంతత కోసమే కార్డెన్ సెర్చ్: డీఎస్పీ విటల్ రెడ్డి  

డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ప్రశాంత వాతావరణం కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహించామని డీఎస్పీ విటల్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు దొంగ వాహనాలను వినియోగిస్తున్నారని, గంజాయి, మద్యం సేవిస్తున్నారని తెలుసుకొని ఇక్కడ సెర్చ్ నిర్వహించామని తెలిపారు.  కొందరు నేరాలు చేసిన వాహనాలు కొంటారని, దొంగిలించిన వాహనాలు ఉంటాయని వాటన్నిటిని గుర్తిస్తున్నామని అన్నారు.

కొందరు ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నందున వారిపై చర్యలు తీసుకునేందుకు విస్తృతంగా తనిఖీ చేసినట్టు చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే వెంటనే ఫోన్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. సెర్చ్‌లో 159 వాహనాలు, 31 ఆటోలు, 3 కార్లు పట్టుకున్నామని, వాటికి సరైన పత్రాలు చూపితే ఇస్తామని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ తిరుపయ్య, బిచ్కుంద ఇన్‌స్పెక్టర్ రవికుమార్, బాన్సువాడ సబ్‌డివిజన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post