Top News

Road Robbery | వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు

కిరాణా షాప్ అడిగినట్లు నటించి వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుడు  

కామారెడ్డి పాత బస్టాండ్ పరిధిలో ఘటన  

7 గ్రాముల బంగారు గొలుసు చోరీ, కేసు నమోదు  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 06: కిరాణా షాప్ ఎక్కడ అని అడిగే నెపంతో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది.  

కూరగాయలు కొనేందుకు వచ్చి బాధితురాలు  

అడ్లూర్ గ్రామానికి చెందిన బాధితురాలు  బంటు పోచవ్వ(70) జూన్ 1న కూరగాయలు కొనేందుకు కామారెడ్డికి వచ్చారు.  కామారెడ్డి డైలీ మార్కెట్‌లో కూరగాయలు కొన్న తర్వాత సాయంత్రం 4:00 నుంచి 4:40 గంటల మధ్య గంజ్ స్కూల్ ముందు నుంచి కొఠారి గల్లీ గుండా కాలినడకన పాత బస్టాండ్ వైపు వెళ్తున్నారు.అదే సమయంలో లేత గులాబీ రంగు చొక్కా ధరించిన గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి కిరాణా షాప్ ఎక్కడ ఉందని అడిగాడు. తెలియదని ఆమె చెప్పేలోపే హఠాత్తుగా మెడపై కొట్టి మెడలో ఉన్న బంగారు గుండ్ల తాడును లాక్కొని పారిపోయాడు.  

14 వేల విలువైన 7 గ్రాముల గొలుసు చోరీ  

దొంగిలించబడిన బంగారు గొలుసు బరువు సుమారు 7 గ్రాములు కాగా దాని విలువ రూ.14,000 ఉంటుంది. ఆ నిందితుడిని మళ్లీ చూస్తే గుర్తుపడతానని బాధితురాలు పోచవ్వ పోలీసులకు తెలిపారు.  ఈ ఘటన జూన్ 1న జరగగా జూన్ 6 సాయంత్రం 6:00 గంటలకు బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

కామారెడ్డి పోలీసులు కేసు నంబర్ 443/2026, BNS సెక్షన్ 309(6) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరస్థుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

1 Comments

  1. 7 గ్రాముల బంగారం ధర మార్కెట్ లో ఎంత ఉందో ఒక సారి బులియన్ మార్కెట్ లో చూడ గలరు..

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post