బైరాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నలుగురు అరెస్ట్ - నగదు, బైక్‌లు, మొబైల్స్ స్వాధీనం
పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రాములు హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో రెక్కీ - నిందితులు అరెస్ట్
పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు రెక్కీ నిర్వహించిన ఎస్సై రాములు బృందం పేకాట ఆడుతున్న కేతావత్ సంగ్రామ్, కేతావత్ ప్రకాష్, ఫతులోత్ సంతోష్, ఎరుకలి సురేష్‌లను అదుపులోకి తీసుకుంది.
నిందితుల నుంచి రూ.2010 నగదు, 3 మొబైల్ ఫోన్లు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.
పేకాట నిర్వహిస్తే కేసులు తప్పవు - ఎస్సై హెచ్చరిక
పేకాటలు ఎవరైనా ఆడినా, ఎవరైనా నిర్వహించినా సమాచారం అందితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాములు హెచ్చరించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Post a Comment