Top News

Police Raid | బాన్సువాడలో పేకాట స్థావరంపై దాడి

బాన్సువాడలో పేకాట స్థావరంపై దాడి  

ఐదుగురు వ్యక్తుల అరెస్ట్, రూ.56,430 స్వాధీనం  

ఫోన్లు, బైకులు సీజ్, కేసు నమోదు  

సమాచారం ఇస్తే గోప్యత: ఎస్‌హెచ్‌ఓ  

 తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: బాన్సువాడ శివారులోని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.  

నగదు, ఫోన్లు, బైకులు స్వాధీనం  

వారి వద్ద నుండి రూ.56,430 నగదు, ఐదు సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

ప్రజలకు ఎస్‌హెచ్‌ఓ విజ్ఞప్తి  

బాన్సువాడ పట్టణ, మండలంలో ఎక్కడైనా పేకాట ఆడినట్లయితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని బాన్సువాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post