మంజీరా ఎత్తిపోతల భూసేకరణపై ఆర్&ఆర్ కమిటీ సమీక్ష
నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో నిర్వాసితులు లేరని వెల్లడి
పునరావాస ప్రయోజనాలు వర్తించవని కమిటీ నివేదిక
కలెక్టర్ అధ్యక్షతన సమావేశం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 10: మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై ప్రాజెక్టు స్థాయి పునరావాస మరియు పునర్నిర్మాణ (R&R) కమిటీ బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించింది.
రెండు గ్రామాల్లో భూసేకరణ పరిశీలన
ఈ సందర్భంగా పిట్లం మండలంలోని నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ అంశాలను కమిటీ పరిశీలించింది.
నిర్వాసితులు లేరని స్పష్టీకరణ
భూసేకరణలో అత్యల్ప విస్తీర్ణంలో మాత్రమే భూములను సేకరిస్తుండటంతో ఎటువంటి నివాస గృహాల నిర్వాసనం జరగడం లేదని, స్థానిక కుటుంబాల జీవనోపాధిపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కమిటీ అభిప్రాయపడింది.
ఆర్&ఆర్ ప్రయోజనాలు వర్తించవు
ఈ నేపథ్యంలో నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో సేకరిస్తున్న భూములకు సంబంధించి భూ సేకరణ, పునరావాసం మరియు పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం-2013 (RFCTLARR Act, 2013) ప్రకారం పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు (R&R Benefits) వర్తించవని కమిటీ నివేదించింది.
హాజరైన అధికారులు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), బాన్సువాడ ఆర్డీవో, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీపీవో, పిట్లం తహసీల్దార్, ఎస్‌బీఐ పిట్లం శాఖ మేనేజర్‌తో పాటు ఆర్&ఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment