5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి: ఆర్డీవో
కార్యక్రమంలో పాల్గొన్న ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. బాన్సువాడ ఆర్డీవో ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. రెండు చుక్కలతో జీవితాంతం పోలియో నుంచి రక్షణ లభిస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీజీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు మహ్మద్ ఏజాస్, బాబా, ఖలీక్, శివదయాల్ వర్మ, సూపరింటెండెంట్,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని పోలియో బూత్‌లలో 0-5 ఏళ్ల పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.






Post a Comment