Top News

RTC BMS Union | బాన్సువాడ డిపోలో బీఎంఎస్ కార్మిక సంఘ్ కార్యవర్గ సమావేశం

బాన్సువాడ డిపోలో బీఎంఎస్ కార్మిక సంఘ్ కార్యవర్గ సమావేశం

నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక 

కార్మికుల సమస్యలపై చర్చించిన రాష్ట్ర నేతలు  

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ డిపో బీఎంఎస్ కార్మిక్ సంఘ్ కార్యవర్గ సమావేశం ఆదివారం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. డిపోలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలు నిర్ణయించారు.  అనంతరం బాన్సువాడ డిపో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

డిపో కమిటీ:

డిపో అధ్యక్షులుగా ధర్మపాల్, కార్యదర్శిగా తులసి రామ్ మారుతి ఎన్నికయ్యారు.  

మహిళా విభాగం: 

మహిళా విభాగం అధ్యక్షులుగా పి. మంజుల, కార్యదర్శిగా పి. విజయ ఎన్నికయ్యారు.  

గ్యారేజ్ విభాగం:

విమల గ్యారేజ్ అధ్యక్షులుగా జావేద్ పాషా, కార్యదర్శిగా శివకుమార్ ఎన్నికయ్యారు.  

ఈ కార్యక్రమంలో గురుడు, అంబాజీ, హనుమండ్లు, శివ, రతన్, పెంటా గౌడ్, వెంకట్రాంరెడ్డి, హనుమాన్లు, వెంకటేష్, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post