కామారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం
వర్చువల్‌గా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్
జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో పూజలు, సందేశ వీక్షణ
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ వర్చువల్ విధానంలో కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూలతోరణాలతో అలంకరించిన నూతన కార్యాలయ ప్రాంగణంలో మాజీ ఎంపీ బిబి పాటిల్, రాష్ట్ర నాయకులు మురళీధర్, బాణాల లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ సందేశాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాషాయ కండువాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా నాయకులు గ్రూప్ ఫొటోలు దిగారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.




Post a Comment