Top News

Sanitation Work | ఆగస్టు 3 వరకు అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు: కమీషనర్ గోపు గంగాధర్

బాన్సువాడలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం  

_వర్షాకాలం దృష్ట్యా 19 వార్డుల్లో విడతల వారీగా శుభ్రత పనులు_  

_3, 13వ వార్డుల్లో పేరుకుపోయిన డ్రైనేజీల పూడిక తొలగింపు_  

_ఆగస్టు 3 వరకు అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు: కమీషనర్ గోపు గంగాధర్_  

_మురికి నీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి_

తెలంగాణ డైలీ న్యూస్/బాన్సువాడ: వర్షాకాలం దృష్ట్యా బాన్సువాడ పురపాలక సంఘ పరిధిలోని 19 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విడతల వారీగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు.

3, 13వ వార్డుల్లో డ్రైనేజీల శుభ్రం 

ఇందులో భాగంగా సోమవారం వార్డు నెం.3 కొయ్యగుట్ట, ఇస్లాంపుర, వార్డు నెం.13 టీచర్స్ కాలనీల్లో పేరుకుపోయిన డ్రైనేజీల్లోని పూడికను పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను శుభ్రపరిచి మురికి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు.

వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు

మునుముందు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమీషనర్ తెలిపారు. జూన్ 22 నుంచి ఆగస్టు 3 వరకు అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ప్రజలకు సూచన 

పట్టణంలో ఎక్కడైనా మురికి నీటి ఇబ్బందులు ఉంటే వెంటనే పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని కమీషనర్ గోపు గంగాధర్ ప్రజలకు సూచించారు.

ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ హకీం, 13వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖాలేక్, హకీమ్,కాసుల రోహిత్, గౌస్, కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post