మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన ‘టీయూడబ్ల్యూజే’ నూతన కమిటీ
_చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌తో మర్యాదపూర్వక భేటీ_
_నూతన కమిటీ సభ్యులకు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘన సన్మానం_
_పట్టణ అభివృద్ధికి జర్నలిస్టుల సహకారం కోరిన చైర్‌పర్సన్_
_జర్నలిస్టులకు మున్సిపాలిటీ తరఫున పూర్తి అండ: హామీ_
తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి, జూన్ 22: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూతన కమిటీ నాయకులు సోమవారం కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన కమిటీకి ఘన సన్మానం
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను చైర్‌పర్సన్ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. TUWJ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన వి. రజనీకాంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లా కార్యదర్శి తోట రాజేష్, కోశాధికారి ముదాం వెంకటేష్, ఉపాధ్యక్షుడు అబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రాము, ఈసీ మెంబర్ శ్రీకాంత్‌లను సన్మానించారు.
పట్టణ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం
అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి జర్నలిస్టులు పూర్తి సహకారం అందించాలని కోరారు. పట్టణ పరిధిలోని ప్రజా సమస్యలను వార్తల రూపంలో వెలుగులోకి తీసుకురావడం వల్లే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు అండగా ఉంటాం
సమాజ హితం కోసం శ్రమిస్తున్న జర్నలిస్టులకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఉంటుందని చెప్పారు. పట్టణ సమస్యలు, అభివృద్ధి అంశాలపై జర్నలిస్టులతో ఆమె ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment