SC Corporation Loans | ఎస్సీ కార్పోరేషన్ 2025-26 దరఖాస్తుల పరిశీలన


ఎస్సీ కార్పోరేషన్ 2025-26 దరఖాస్తుల పరిశీలన  

బాన్సువాడ పట్టణానికి 6 యూనిట్లు మంజూరు, 24 దరఖాస్తులు స్వీకరణ  

ఈ-స్కూటీ-3, త్రీవీలర్ ఆటో-1, పశువులు-1, సోలార్ పంపు సెట్-1 చొప్పున టార్గెట్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 18: బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో ఎస్సీ కార్పోరేషన్ 2025-26 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులు పరిశీలించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ అధికారి నరేష్, పశువైద్యాధికారి మహేష్, ఆయా బ్యాంకు మేనేజర్లు, పురపాలక సంఘం కమీషనర్ గోపు గంగాధర్ పాల్గొన్నారు.

6 యూనిట్ల టార్గెట్ కేటాయింపు

ప్రభుత్వం నుంచి బాన్సువాడ పట్టణానికి ఈ-స్కూటీ-3, త్రీవీలర్ ఆటో-1, పశువులు-1, సోలార్ పంపు సెట్-1 చొప్పున మొత్తం 6 యూనిట్ల టార్గెట్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 24 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.

ఉన్నత అధికారులకు పంపిన తర్వాత మంజూరు  

స్వీకరించిన దరఖాస్తుదారుల వివరాలను పైస్థాయి అధికారులకు పంపించిన తదుపరి లోన్లను మంజూరు చేయడం జరుగుతుందని ఎస్సీ కార్పోరేషన్ అధికారి నరేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ అధికారి, బ్యాంకు మేనేజర్లు, పశువైద్యాధికారి, పురపాలక సంఘం కమీషనర్, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم