ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీకి పాముకాటు
బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీకి పాము కాటేసింది.
చెరువు మట్టి తీసేందుకు వెళ్లగా ప్రమాదం
గ్రామానికి చెందిన కొందరు కూలీలు చెరువు మట్టిని తీయడానికి వెళ్లారు. ఆ సమయంలో కొక్కర హన్మవ్వ (48) అనే మహిళ కాళ్లకు పాము చుట్టుకుని కాటేసింది. ఒక్కసారిగా ఆమె కేకలు వేయడంతో తోటి కూలీలు వెంటనే స్పందించి పాము బారి నుంచి ఆమెను తప్పించారు.
మంత్రం వేయించి ఆసుపత్రికి తరలింపు
మొదట సమీపంలోని కృష్ణానగర్ తాండకు తీసుకెళ్లి మంత్రం వేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఫీల్డ్ అసిస్టెంట్‌కు తెలియదు, అధికారుల నిర్లక్ష్యం
అయితే ఆ మహిళకు పాము కరిచిన విషయం ఫీల్డ్ అసిస్టెంట్‌కు తెలియకపోవడం గమనార్హం. విషయాన్ని అధికారులకు తెలియజేసినప్పటికీ వారు ఆసుపత్రికి రాలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామని వారు చెప్పినట్లు సమాచారం.
నోట్ : వీడియో కోసం లింక్ ఓపెన్ చేయగలరు.


Post a Comment