Top News

TG Formation Day | అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం - ఎస్పీ

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు  

జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర  

అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం - ఎస్పీ  

ఏడుగురు పోలీసు అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవా పతకాలు  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి.  

జిల్లా క్యాంపు కార్యాలయం మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.  

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులు చేసిన ఆత్మబలిదానాలు, మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.  

జిల్లా పోలీసు శాఖ తరపున కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టం కింద నమోదవుతున్న నేరాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)  కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, ఆర్‌ఎస్‌ఐ శైలూ, ఎస్‌ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

ఉత్తమ సేవా పథకాలు పొందిన వారి వివరాలు:  

1. జె. హరికృష్ణ - ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, కామారెడ్డి - ఉత్తమ సేవా పతకం  

2. సి. మోహన్ - సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, బాన్సువాడ - సేవా పతకం  

3. కె. నర్సింగరావు - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాజంపేట - సేవా పతకం  

4. ఎస్. దామోదర్ రెడ్డి - రిజర్వు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామారెడ్డి - సేవా పతకం  

5. ఎస్. దత్తయ్య - హెడ్ కానిస్టేబుల్, బాన్సువాడ డీఎస్పీ ఆఫీస్ - సేవా పతకం  

6. కె. విట్టల్ - ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, కామారెడ్డి - సేవా పతకం  

7. ఎస్. రవీందర్ కుమార్ - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తాడ్వాయి పోలీస్ స్టేషన్ - ఉత్తమ సేవా పతకం  












Post a Comment

Previous Post Next Post