Top News

TMU to BMS | బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘంలోకి నిజామాబాద్ 2 డిపో కార్మికులు

టీఎంయూ నుంచి బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘంలోకి నిజామాబాద్ 2 డిపో కార్మికులు  

ఆర్టీసీ ఉద్యోగుల శ్రేయస్సు కోసమే చేరిక: ఎర్రస్వామి కుమార్  

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడే యూనియన్‌లో ఉండాలనే ఆలోచనతో నిజామాబాద్ 2 డిపో కార్మికులు టీఎంయూ నుంచి భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్‌లో చేరారు.  

ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎర్రస్వామి కుమార్ మాట్లాడుతూ, సంఘంలో చేరిన కార్మికులకు స్వాగతం సుస్వాగతం పలికారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే సంఘంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే వారు బీఎంఎస్ అనుబంధ సంఘంలో చేరారని తెలిపారు.  

కార్మికుల సమస్యల పరిష్కారం, శ్రేయస్సు కోసం టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ కట్టుబడి ఉందని, నూతనంగా చేరిన కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.



Post a Comment

Previous Post Next Post