కార్యవర్గం, ఎలక్ట్రానిక్ విభాగం పదవులన్నీ ఏకగ్రీవం
నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల అధికారి ప్రకటన
శుక్రవారం వరలక్ష్మి గార్డెన్‌లో ప్రమాణ స్వీకారం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 11: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కామారెడ్డి జిల్లా శాఖ కార్యవర్గం, యూనియన్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
నామినేషన్ల స్వీకరణ
ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన లస్కర్ సత్యనారాయణ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించి పరిశీలన చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నిక
అన్ని పదవులకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయని, ఒక్కో పదవికి ఒక్కటే నామినేషన్ వచ్చినందున జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి సత్యనారాయణ ప్రకటించారు.
శుక్రవారం ప్రమాణ స్వీకారం
శుక్రవారం కామారెడ్డి అశోక్ నగర్ వరలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించే కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు విరాహత్ అలీ, కార్యదర్శి రాం నారాయణ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణా రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేస్తున్నారని, జర్నలిస్ట్ మిత్రులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

إرسال تعليق