Top News

TUWJ (IJU) | షబ్బీర్ అలీని కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

షబ్బీర్ అలీని కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు  

నూతన జిల్లా కమిటీ సభ్యులను సత్కరించిన ప్రభుత్వ సలహాదారు  

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ  

తెలంగాణ డైలీ న్యూస్/కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నూతన కమిటీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.  

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను షబ్బీర్ అలీ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీని మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు.  

అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జర్నలిస్టులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమాజ హితం కోసం శ్రమిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.  

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వి. రజనీకాంత్, జిల్లా కార్యదర్శి తోట రాజేష్, ఉపాధ్యక్షులు సయ్యద్ కౌసర్ అలీ,కోశాధికారి ముదాం వెంకటేష్, ఉపాధ్యక్షుడు అబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రాము, ఈసీ మెంబర్ శ్రీకాంత్ తదితరులు షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post