DMAC Meeting | కామారెడ్డిలో DMAC సమావేశం

కామారెడ్డిలో DMAC సమావేశం 

155 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు

కామారెడ్డి, సెప్టెంబర్ 16: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) సమావేశం బుధవారం కలెక్టరేట్ లో జరిగింది. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్, ఇంచార్జ్ DPRO ఎన్.వై. గిరి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టుల వివరాలను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. మూడవ విడతలో 155 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తూ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 500 మందికి అక్రిడిటేషన్ కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అనంతరం కమిటీ సభ్యులు కలెక్టర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

సమావేశంలో కమిటీ సభ్యులు రాజనీకాంత్, రాజేంద్రనాథ్, మొహియుద్దీన్, ఆబిద్ హుస్సేన్, శశిధర్, చంద్రశేఖర్, వేణు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post