దాతృత్వం చాటుకున్న అలయన్స్, వాసవి క్లబ్ సభ్యులు
ప్రవాస భారతీయుల సహకారంతో చెక్కు అందజేత
(దాస శ్రీనివాస్ )
సిద్ధిపేట, తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో :
బీటెక్ చదువుతున్న పేద విద్యార్థినికి సిద్ధిపేట అలయన్స్, వాసవి క్లబ్ ప్రతినిధులు ఆర్థిక సహాయం చేశారు. ప్రవాస భారతీయుడు ప్రొద్దుటూరి గౌరీ, సందీప్ ల సహకారంతో మంగళవారం బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న పబ్బతి పార్వతి చైతన్యకు రూ.40 వేల చెక్కును అందజేశారు.
స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంప శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి, అలయన్స్ క్లబ్‌లు ఎప్పుడూ ముందుంటాయన్నారు. పేద విద్యార్థికి చదువుకు బాసటగా నిలవడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించిన గౌరీ, సందీప్‌లను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 162 గవర్నర్ సోమ శివకుమార్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి సోమ వనజ, సభ్యులు బెజగాం ఆత్మ రాములు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంప కృష్ణమూర్తి, రీజియన్ చైర్మన్ చింత రాజేంద్రప్రసాద్, జోన్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, రీజన్ సెక్రెటరీ అర్వపల్లి హరి, వాసవి క్లబ్ అధ్యక్షులు కూర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగమల్ల కిషన్, అలయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ప్రతినిధులు జూలూరి శ్రీనివాస్, గౌరిశెట్టి దామోదర్, చకిలం రవి, సుజన తదితరులు పాల్గొన్నారు.

Post a Comment