Top News

Women's Suicide | బాన్సువాడలో ఉరి వేసుకుని మహిళ మృతి

బాన్సువాడలో ఉరి వేసుకుని మహిళ మృతి  

మానసిక ఆరోగ్యం బాగాలేక ఆత్మహత్య  

కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు  

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో మహిళ ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.  

పోలీసుల కథనం ప్రకారం గుట్టమీది అనూషవ్వ భర్త సాయబోయి, వయసు 50 సంవత్సరాలు, కులం గుండ్ల, వృత్తి కూలి పని. నివాసం ఇబ్రహీంపేట్ గ్రామం. ఆమె గత మూడు సంవత్సరాల నుండి మానసిక ఆరోగ్యం బాగాలేక అప్పుడప్పుడు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లి తిరిగి వచ్చేది.  

అలాగే 26.06.2026 రోజున తెల్లవారుజామున ఇంట్లో నుండి వెళ్లి గ్రామ చివరన గల గుట్ట ప్రాంతంలో మోదుగ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయింది.  

మృతురాలి మానసిక ఆరోగ్యం బాగాలేనందున జీవితం మీద విరక్తి చెంది తనకు తానుగా ఉరివేసుకొని చనిపోయినదని మృతురాలి కొడుకు గుట్టమీద కాశిరాం ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post