Top News

BSWD Bus Stopped | నిజామాబాద్‌లో బాన్సువాడ బస్సును అడ్డుకున్న ప్రయాణికులు

బస్సు ప్రయాణికులతో నిండిపోయాక బస్టాండ్ లో నిల్చున్న ఇంకా వంద మంది ప్రయాణికులు 

నిజామాబాద్‌లో బాన్సువాడ బస్సును అడ్డుకున్న ప్రయాణికులు  

బస్టాండ్‌లో 200 మంది ప్రయాణికులు, చివరి బస్సు నిలిపివేత  

ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం, అదనపు బస్సు ఏర్పాటు

నిజామాబాద్: నిజామాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్లే ఆఖరి బస్సును బుధవారం రాత్రి ప్రయాణికులు అడ్డుకున్నారు.

నిజామాబాద్ నుంచి బాన్సువాడకు రాత్రి 8 గంటల తర్వాత 10 గంటల వరకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో బస్టాండ్‌లో సుమారు 200 మంది ప్రయాణికులు ఉండిపోయారు. 10 గంటలకు వెళ్లే బస్సులో ఏకంగా 120 మంది ఎక్కగా, ఇంకా 60 మంది వరకు ప్రయాణికులు బస్టాండ్‌లోనే మిగిలిపోయారు. వీడియో 👇


దీంతో బస్సు ఎక్కలేని ప్రయాణికులు బస్సు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరో బస్సు ఏర్పాటు చేసే వరకు బస్సు కదలనివ్వబోమని వారు పట్టుబట్టారు. ఆర్టీసీ అధికారుల తీరుపై నిరసన తెలిపారు. 

ప్రతి రోజు నిజామాబాద్ బస్టాండ్‌లో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, ఆర్టీసీ అధికారులు సమయం ప్రకారం బస్సులు నడపడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసి తీరుపై వారు 'తెలంగాణ డైలీ న్యూస్' కు ఫోన్ ద్వారా వివరించారు. లాస్ట్ బస్సు వెళ్లిపోతే సీట్లు లభించక బస్టాండ్‌లోనే నిద్రించాల్సి వస్తుందని వారు వాపోయారు.


నిజామాబాద్‌లో ఉద్యోగాలు, చదువు, ప్రభుత్వ పనుల నిమిత్తం మోస్రా, చందూర్, వర్ని, నసారులాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బాన్సువాడ బస్సు డిపో అధికారులు సమయ పాలన పాటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

సుమారు గంట పాటు బస్సు నిలిపివేయడంతో అధికారులు స్పందించి రాత్రి 10.50 గంటలకు వేరే బస్సు వేశారు. అప్పుడు రెండు బస్సులు బాన్సువాడకు బయలుదేరాయి.





Post a Comment

Previous Post Next Post