Top News

Collector | ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్  

ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం  

యూపీఐ ద్వారా బిల్లు చెల్లించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా  

నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి :  

నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం రుచికరంగా, నాణ్యతగా ఉందని నిర్వాహకులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.  

క్యాంటీన్‌లో పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటిస్తూ, సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ యూపీఐ ద్వారా భోజనానికి సంబంధించిన చెల్లింపును స్వయంగా చేశారు.  

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post