బాన్సువాడ 18వ వార్డులో SIR ఫార్ముల అందజేత
ఓటరు జాబితా సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: బీఆర్ఎస్ నాయకుడు ఇసాక్
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్ :
బాన్సువాడ పట్టణంలోని 18వ వార్డులో బుధవారం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుండి సేకరించిన SIR ఫార్ములను సంబంధిత BLOలకు అందజేశారు.
ఈ కార్యక్రమం ఎం.ఆర్.ఓ నరేందర్ గౌడ్ సమక్షంలో, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొహమ్మద్ ఇషాక్ ఆధ్వర్యంలో జరిగింది. ఓటర్ల నుండి అందిన ఫార్ములను పరిశీలించి BLOలకు అప్పగించారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ ఇషాక్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును కాపాడుకునేందుకు SIR ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని అవసరమైన ఫార్ములను సమర్పించాలని కోరారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 3వ వార్డు నాయకులు సయ్యద్ ఉబెద్, బీఆర్ఎస్ పార్టీ BLAలు ఖాలెత్, అఫ్జల్, యాహియా ఖాన్, BLOలు వనజ, నవీత, ఎన్నికల శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment