Top News

Congress Protest | బాన్సువాడలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

నీట్ పేపర్ లీక్, నాయకుల అరెస్టులను ఖండించిన కాంగ్రెస్

బాన్సువాడలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

కేంద్రం నిరంకుశ వైఖరిపై కాసుల ధ్వజం 

బాన్సువాడ: నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటును ముట్టడించిన విద్యార్థులపై భాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జ్ చేసిన చర్యను, అలాగే జాతీయ నాయకుల అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని తాడ్‌కోల్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

కేంద్రం నిరంకుశ వైఖరినపై ధ్వజం 

ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ తదితరులు ప్రధాని నివాసం ఎదుట బైఠాయించారన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన దాడిపై పార్లమెంటులో చర్చ జరగాలని, నీట్ లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మొహసిన్, కౌన్సిలర్లు మహమ్మద్ ఖలీక్, నందకిషోర్, నగేష్, జిల్లా యువజన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్, కో-ఆప్షన్ సభ్యులు కమర్, గౌస్, అబ్దుల్ మజీద్, వహాబ్ బై, ఎక్స్ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, గుడాల నగేష్, మట్ట సాయిలు యాదవ్, దాసరి శ్రీనివాస్, బోడ భాస్కర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post