Top News

Asst Labour Commissioner |భవన నిర్మాణ కార్మికుల పథకాల కోసం దళారులను నమ్మవద్దు

భవన నిర్మాణ కార్మికుల పథకాల కోసం దళారులను నమ్మవద్దు 

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శశికుమార్ హెచ్చరిక

కామారెడ్డి: భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు TBOCWWB పథకాలకు సంబంధించి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులు, మధ్యవర్తులు లేదా అనధికార వ్యక్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డా. వై. శశికుమార్ తెలిపారు.బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. TBOCWWB సంక్షేమ పథకాల నమోదు, క్లెయిమ్ దరఖాస్తులు పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు.

మీసేవ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు

కార్మికులు మీసేవ (Meeseva) కేంద్రాల ద్వారా పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలపై సంబంధిత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కామారెడ్డి మరియు బాన్సువాడ ALO గారి ప్రాథమిక సంతకం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అధికారిక సంతకం లేని దరఖాస్తులు మీసేవలో అంగీకరించబడవని, క్లెయిమ్‌లు ఆమోదించబడవని స్పష్టం చేశారు. కార్మిక శాఖ ద్వారా అందించే సేవలు పూర్తిగా ఉచితమన్నారు. కార్మికులు ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని కోరారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కార్మిక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

================

NMMS స్కాలర్‌షిప్ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం  

చివరి తేదీ ఆగస్టు 24

కామారెడ్డి: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ NMMS పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

ప్రభుత్వ పరీక్షల నిర్వహణ కార్యాలయ వెబ్‌సైట్ http://bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అర్హతలు ఏమిటి?

2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు.

- ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ మరియు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 7వ తరగతిలో 55 శాతం మార్కులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. SC, ST విద్యార్థులకు 50 శాతం సరిపోతుంది.

- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000/- లోపు ఉండాలి.

ఫీజు వివరాలు

- జనరల్, బీసీ విద్యార్థులు: రూ. 100/-

- SC, ST మరియు దివ్యాంగ విద్యార్థులు: రూ. 50/-

పరీక్ష ఫీజును SBI Collect లింక్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

వివరాలు: ఆన్‌లైన్ దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు  

చివరి తేదీ: 24.08.2026

వివరాలు: ప్రధానోపాధ్యాయులు ముద్రిత దరఖాస్తులు, నామినల్ రోల్స్ జిల్లా విద్యాశాఖకు సమర్పణ  

చివరి తేదీ: 01.09.2026

ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల 7వ తరగతి మార్కుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, దివ్యాంగ ధృవీకరణ పత్రం నకళ్లను జతచేయాలని సూచించారు.

అన్ని పత్రాలను 02.09.2026 లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయం, కామారెడ్డిలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు.

మరిన్ని వివరాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లేదా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Post a Comment

Previous Post Next Post