విద్యుత్ షాక్‌తో రెండు గేదెల మృతి
పాడి రైతుకు రూ.2 లక్షల నష్టం
పాత బాన్సువాడలో విషాద ఘటన
ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో సాయంత్రం విద్యుత్ షాక్‌తో రెండు గేదెలు మృతి చెందిన ఘటన విషాదం నింపింది.
పాత బాన్సువాడకు చెందిన పాడి రైతు ఉప్పరిగారి సాయిగొండకు చెందిన రెండు గేదెలు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికుల వివరాల ప్రకారం, మేతకు వెళ్లిన గేదెలు దారిలోని విద్యుత్ ప్రవహిస్తున్న ఇనుప స్తంభాన్ని తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాయి.
ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.2 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిసింది. జీవనాధారమైన రెండు గేదెలను కోల్పోవడంతో రైతు సాయిగొండ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


Post a Comment