DCHS Meet to Collector | జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు సమన్వయంతో పనిచేస్తామని హామీ

కామారెడ్డి: జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త (DCHS), బాన్సువాడ ఏరియా ఆసుపత్రి, మాతా-శిశు ఆసుపత్రి MCH మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎం. శ్రీనివాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల, ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు కృషి చేస్తామని డాక్టర్ శ్రీనివాస్ కలెక్టర్‌కు వివరించారు.

Post a Comment

Previous Post Next Post