పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సద్గురు సమర్థ మహారాజ్ పూజ
పెద్ద ఎత్తున పాల్గొన్న కుటుంబ సభ్యులు, నాయకులు, భక్తులు
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ గారిచే శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమం నిర్వహించారు.
నిన్న సాయంత్రం 23 జూలైన జరిగిన ఈ కార్యక్రమంలో పోచారం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోచారం శంభు రెడ్డి - ప్రేమల దంపతులు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి - సోని రెడ్డి దంపతులు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు.
ఈ శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ నామస్మరణ, గురు వందనం కార్యక్రమాలు భక్తి వాతావరణంలో జరిగాయి.







Post a Comment