త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు
మున్సిపల్ అధికారులను సూచించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్
ఫిల్టర్ బెడ్ పరిశీలన
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ అన్నారు.
మంగళవారం ఆయన పట్టణంలోని ఫిల్టర్ బెడ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న నీటి శుద్ధి, సరఫరా విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు నిరంతరంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు త్రాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఖలేఖ్, బోడ భాస్కర్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Post a Comment