29న సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్
ముందస్తు వైద్యపరీక్ష.. మీ ప్రాణానికి రక్ష
ఒక్కరోజు సమయం.. జీవితాంతం ఆరోగ్యం
(దాస శ్రీనివాస్ - సిద్దిపేట బ్యూరో)
ఈ నెల 29 బుధవారం రోజున సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్ సింధూ క్యాన్సర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
హరీష్ రావు పిలుపు
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆలస్యం చేయడమే ప్రమాదమని అన్నారు. ముందస్తు పరీక్ష మీ ప్రాణానికి రక్ష. ఒక్క రోజు సమయం తీసుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు.
ఒక్కోసారి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. కానీ స్క్రీనింగ్ పరీక్షలో ఆ లక్షణాలు బయటపడతాయని చెప్పారు. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఈ శిబిరానికి తప్పనిసరిగా హాజరు కావాలని, కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని కోరారు.
గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ లతో చాలామంది మహిళలు బాధపడుతున్నారని, దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోతున్నారని తెలిపారు. దీనికి ప్రధాన కారణం లక్షణాలను నిర్లక్ష్యం చేయడమేనన్నారు.
మీరు ఎక్కడికో వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ మహానగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులను మీ దగ్గరకు మన సిద్దిపేటకు తీసుకొస్తున్నామని చెప్పారు. గతంలోనూ కార్పొరేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, కొంతమందికి లక్షణాలు ఉన్నట్లు తేలాయి. అప్పటికప్పుడు వారు చికిత్స ప్రారంభించడంతో ప్రాణాలతో బయటపడ్డారని, ఆ మహిళల ప్రాణాలను రక్షించామనే తృప్తి ఉందన్నారు.
కార్యక్రమ వివరాలు
*తేదీ:* ఈ నెల 29, బుధవారం
*సమయం:* ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
*ప్రదేశం:* సిద్దిపేట బైపాస్ రోడ్డులోని విపంచి కళానిలయం
*ఎవరికి:* 40 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు
చేసే పరీక్షలు
40 సంవత్సరాలు పైబడిన మహిళలకు అవసరము మేరకు క్రింది పరీక్షలు ఉచితంగా చేస్తారు:
1. పాప్ స్మియర్ టెస్ట్ - గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకు
2. మామోగ్రామ్ - ఛాతీ క్యాన్సర్ నిర్ధారణకు
3. రక్త పరీక్షలు
4. X-Ray
40 ఏళ్లు దాటిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు గారు కోరారు.

Post a Comment