250 మందికి పరీక్షలు, మందుల పంపిణీ
(దాస శ్రీనివాస్ - సిద్దిపేట బ్యూరో)
ఆదివారం ఆర్య వైశ్య ఐక్య వేదిక సిద్దిపేట ఆధ్వర్యంలో వెల్నెస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గంప శ్రీనివాస్ గారు, ఆర్య వైశ్య మహాసభ కార్యదర్శి అయిత రత్నాకర్ గారు, wellness hospital ప్రతినిధి కూర నాగరాజు గారు, ఆర్య వైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు గారు, ఆర్య వైశ్య ఐక్య వేదిక విభాగం ఆర్య వైశ్య దర్శిని సిద్దిపేట జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి యాజమాన్యం అందించే ప్రయోజనాలు:
ఉచిత కుటుంబ ఆరోగ్య కార్డును ఉపయోగించినప్పుడు క్రింది సౌకర్యాలు లభిస్తాయి:
1. OP పై 50% తగ్గింపు
2. పరీక్షలపై 20% తగ్గింపు
3. మందులపై 10% తగ్గింపు
ఈ ఆరోగ్య శిబిరంలో 250 మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు కూడా తీసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్య వైశ్య ఐక్య వేదిక సభ్యులను, వెల్నెస్ హాస్పిటల్ సిబ్బందిని నిర్వాహకులు అభినందించారు.




Post a Comment