ఒక్కరోజులో 61.6 మి.మీ - సాధారణం కంటే 555% అధికం
కళ్యాణి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్ లో 8 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
కామారెడ్డి, జూలై 29: జిల్లాలో బుధవారం అన్ని 25 మండలాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు వర్షపాతం 61.6 మి.మీ నమోదైంది.సాధారణంగా ఈ రోజుకు 9.4 మి.మీ వర్షం పడాల్సి ఉండగా, 555% అధికంగా కురవడంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.
సీజన్ గణాంకాలు :
జూన్ 1 నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 401.3 మి.మీ వర్షం నమోదైంది.
సాధారణ సీజనల్ వర్షపాతం 375.5 మి.మీ తో పోలిస్తే ఇది 7% ఎక్కువ.
ప్రస్తుతం జిల్లా వర్షపాత స్థితి Normal గా ఉంది.
మండలాల వారీగా వర్గీకరణ:
జిల్లాలోని 25 మండలాల్లో
20 మండలాలు Normal కేటగిరీలో
4 మండలాలు Excess కేటగిరీలో
1 మండలం Large Excess కేటగిరీలో ఉన్నాయి.
టాప్ 5 అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు
1. పిట్లం - 99.4 మి.మీ
2. మహమ్మద్‌నగర్ - 96.0 మి.మీ
3. జుక్కల్ - 95.6 మి.మీ
4. రాజంపేట - 72.6 మి.మీ
5. గాంధారి - 69.9 మి.మీ
ఈ 5 మండలాల్లోనూ సాధారణం కంటే 6 నుండి 10 రెట్లు అధికంగా వర్షం కురిసింది.
బాన్సువాడ మండలంలో 58.0 మి.మీ వర్షం పడింది. ఇది సాధారణం 12.5 మి.మీ కంటే 364% ఎక్కువ.
సీజన్ మొత్తం ఇక్కడ 466.8 మి.మీ వర్షం నమోదైంది.
Excess మరియు Large Excess మండలాలు
భిక్కనూరు మండలం Large Excess కేటగిరీలో ఉంది. ఇక్కడ 67.0 మి.మీ వర్షంతో పాటు సీజన్ మొత్తం 560.4 మి.మీ నమోదైంది. ఇది సాధారణం కంటే 60% అధికం. తాడ్వాయి, కామారెడ్డి, డోమకొండ, మహమ్మద్‌నగర్ మండలాలు Excess కేటగిరీలో ఉన్నాయి.
🔴 ప్రాజెక్ట్ అప్డేట్ 🔴
కళ్యాణి ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేత
ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 2 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 430 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 430 క్యూసెక్కులుగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో పెరుగుతున్న ఇన్ ఫ్లో
భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 8వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు, పూర్తి నీటిమట్టం 1405 అడుగులు.
ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులు, ప్రస్తుత నిల్వ 7.139 టీఎంసీలుగా ఉంది. గత సంవత్సరం ఇదే రోజు నిల్వ 4.597 టీఎంసీలు, నీటిమట్టం 1391.25 అడుగులుగా ఉంది. ఈ ఏడాది గతేడాదితో పోలిస్తే నిల్వ గణనీయంగా పెరిగింది.
అధికారుల సూచనలు
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు.


Post a Comment