House Hold Survey | 13వ వార్డులో ఎన్‌సిడి సర్వే, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నమోదు

13వ వార్డులో ఎన్‌సిడి సర్వే, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నమోదు  

5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం - ఖమర్ గౌస్

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా ఎన్‌సిడి సర్వే నిర్వహిస్తున్నారు. 

ఎన్‌సిడి అనగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించని వ్యాధులు. బిపి, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు ఆధార్ కార్డులు ఇచ్చి ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఈ సందర్బంగా వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖాలేక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆబా కార్డ్ - ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ను కూడా చేస్తున్నారన్నారు. ఇది ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ,. ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్షన్స్ సభ్యులు ఖమర్ గౌస్ కోరారు. ఎన్‌సిడి, ఆబా కార్డు ఆయుష్మాన్ భారత్ సర్వే చేస్తున్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు ఆధార్ కార్డులు ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అలీ బిన్ అబ్దుల్లా, కాలనీవాసులు హఫీజ్, రావు, సబ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post