జర్నలిస్టుల బస్ పాసుల గడువు జూలై 22 వరకు పొడిగింపు
అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీకి ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్ లేఖ
హైదరాబాద్, తెలంగాణ డైలీ న్యూస్:
రాష్ట్ర, జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరాలకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, పాత అక్రిడిటేషన్ కార్డుల (2024-2026) వాలిడిటీని జూలై 22, 2026 వరకు పొడిగించినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి తెలిపారు.
ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. పాత రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల బస్ పాసుల వాలిడిటీని జూలై 1 నుంచి జూలై 22, 2026 వరకు 22 రోజుల పాటు పొడిగించాలని, అక్రిడిటేషన్ కార్డుల వాలిడిటీ కోసం పట్టుబట్టవద్దని లేఖలో కోరారు.
లేఖ నం. 001218/MR/2026, తేది: 01.07.2026 ద్వారా ఈ ఆదేశాలు జారీ చేశారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత పాసులను అనుమతించాలని సూచించారు.
ఈ లేఖ కాపీని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్, రాష్ట్రంలోని అన్ని డీపీఆర్ఓలకు సమాచారం, తగు చర్యల నిమిత్తం పంపారు.

Post a Comment