Top News

Jukkal MLA Visit | ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పర్యటన

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పిట్లం పర్యటన  

SIR సమీక్ష, ప్రజలతో చాయ్ పే చర్చ

పిట్లం: జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత పటిష్టపరచడంతో పాటు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా పిట్లం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సమీక్షించారు. ఓటరు జాబితా నుంచి ఎవరూ పేరు మిస్ కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని వారు సూచించారు.

ప్రజలతో మమేకమైన నాయకులు  

అనంతరం నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా వద్ద ఉన్న హోటల్‌లో స్థానిక ప్రజలతో కలిసి చాయ్ తాగుతూ ముచ్చటించారు. "చాయ్ పే చర్చ" కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అన్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రోడ్లు, ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post