సర్ పై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచన
కామారెడ్డి: వచ్చే నెల 10వ తేదీ వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి మండల, మున్సిపాలిటీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ, SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అసలైన ఓటర్ల ఓటు హక్కును కాపాడేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. BLO లు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి అందజేసే బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు.
ఈ నెల 3వ తేదీ వరకు పూర్తి చేసిన దరఖాస్తులను BLO లకు అందజేయాలని, 10వ తేదీన తుది ఓటర్ లిస్టును ప్రకటిస్తారని చెప్పారు. ఆ లిస్టును క్షుణ్ణంగా చెక్ చేసి అర్హులైన వారి పేర్లు ఉన్నాయా లేవా అని పరిశీలించాలని సూచించారు.ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు బాధ్యతగా పనిచేసి పార్టీకి మేలు జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, బల్వంత్ రావు, జెర్సీ నర్సింలు, హనుమాన్లు, కృష్ణాజీ రావు, శశికాంత్, పుల్లూరు సతీష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment