Mala Union Activity | రోస్టర్ మార్పులు, వర్గీకరణపై ప్రజలకు వివరణ

నిజాంసాగర్‌లో మాల సంఘం అవగాహన కార్యక్రమాలు  

రోస్టర్ మార్పులు, వర్గీకరణపై ప్రజలకు వివరణ  

3 గ్రామాల్లో కమిటీల ఏకగ్రీవ ఎన్నిక

నిజాంసాగర్ : మాలల ఐక్యత, హక్కుల సాధనే ధ్యేయంగా మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్  నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. కుల వర్గీకరణ నేపథ్యంలో రోస్టర్ విధానంలో వస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

రోస్టర్ మార్పులపై అవగాహన  

మాగి, నిజాంసాగర్, వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్లలో జరిగే మార్పులను వివరించారు. వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి జరిగే అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించి, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.క్షేత్రస్థాయి నుంచే ఉద్యమాన్ని ఉదృతం చేసి హక్కులు సాధిస్తామని స్పష్టం చేశారు.

గ్రామ కమిటీల ఎన్నిక

ఈ సందర్భంగా పై గ్రామాల్లో మాల సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సామాజిక వర్గ సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మాల సంఘం - నర్సింగ్ రావుపల్లి గ్రామ అధ్యక్షులు మస్కురి సామెల్, ఉపాధ్యక్షులు గైని విఠల్, ప్రధాన కార్యదర్శి గైని మిద్దింటి నగేష్, కోశాధికారి గైని సాయిలు మరియు గైని లింగం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post