జుక్కల్లో ఆర్టీసీ బస్ డిపో, బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతి
మంత్రి పొన్నం సానుకూల స్పందన
మంత్రి పొన్నంకు గజామలతో ఘన స్వాగతం
జుక్కల్, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా పర్యటన ముగించుకుని జుక్కల్ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ నాయకులతో కలిసి గజ్జమాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రికి ఆత్మీయ అభివాదాలు తెలియజేస్తూ, జుక్కల్ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్షలైన ఆర్టీసీ బస్ డిపో, బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, NRI కాంగ్రెస్ పార్టీ సభ్యుడు భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Post a Comment