Minority College Shift | ఎల్లారెడ్డి నుంచి లింగంపేటకు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తరలింపు

ఎల్లారెడ్డి నుంచి లింగంపేటకు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తరలింపు  

ముస్లిం వెల్ఫేర్ కమిటీ నిరసన, RDO కు వినతి 

ప్రిన్సిపాల్ ను నిలదీసిన కమిటీ సభ్యులు

తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను లింగంపేటకు తరలిస్తుండటంతో ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.

ఆదివారం నాడు కళాశాల ఫర్నిచర్ తో పాటు ఇతర సామాగ్రిని తరలిస్తుండగా కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో సభ్యులు అడ్డుకున్నారు. కళాశాలను తిరిగి ఎల్లారెడ్డిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ఉమ్మడి జిల్లా మైనారిటీ అధికారితో ఫోన్లో మాట్లాడగా, ప్రిన్సిపాల్ ఇచ్చిన నివేదిక మేరకు లింగంపేటకు తరలిస్తున్నామని, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని సమాధానం ఇచ్చారు. అయితే డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డి నుంచి ఎందుకు తరలిస్తారని, ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

RDO కు వినతి పత్రం సమర్పణ  

సోమవారం కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్ నేతృత్వంలో సభ్యులు ఎల్లారెడ్డి RDO ను కలిసి వినతి పత్రం అందజేసిన విషయం విదితమే.గత ఆరు సంవత్సరాలుగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో విజయవంతంగా నడుస్తున్న ఈ కళాశాల, ఎల్లారెడ్డి మరియు పరిసర ప్రాంతాల మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని వారు తెలిపారు.అయితే 2026-27 విద్యా సంవత్సరం నుంచి కళాశాలను లింగంపేటకు తరలించడంతో స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు చదువు కొనసాగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ లక్ష్యానికి ప్రతికూల ప్రభావం 

ప్రభుత్వం ఎల్లారెడ్డికి మంజూరు చేసిన కళాశాలను ఇక్కడే కొనసాగిస్తే స్థానిక మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను సులభంగా అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. తరలింపు వల్ల విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంతో పాటు మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల అభిప్రాయాలు మరియు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని 2026-27 విద్యా సంవత్సరం నుంచే కళాశాలను తిరిగి ఎల్లారెడ్డిలో కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు షేక్ గయాసుద్దీన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ మీర్, ముఖర్రం అలీ, సభ్యులు అహమ్మద్, సాదిక్, వాజిద్, సాజిద్, ఇమ్రాన్, యూనుస్, ఏజాస్ అహ్మద్ మస్రూర్, జియా తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post