Top News

MLA PSR | ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా చెక్కుల అందజేత

బాన్సువాడ నియోజకవర్గంలో 43 మందికి రూ.12.86 లక్షల CMRF చెక్కుల పంపిణీ  

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా చెక్కుల అందజేత  

బాన్సువాడ గ్రామీణ మండలంలో 6 మందికి రూ.2.03 లక్షలు  

రుద్రూర్ మండలంలో అత్యధికంగా 9 మందికి రూ.2.39 లక్షలు  

10 మండలాల లబ్ధిదారులకు సహాయం అందజేత  

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద బాన్సువాడ నియోజక వర్గంలోని 43 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.12,86,000 చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.  

ఈ కార్యక్రమంలో    బాన్సువాడ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎర్వలా కృష్ణారెడ్డి, మహ్మద్ ఏజాస్, అబ్దుల్ వాహబ్, చంద్రశేఖర్, దావూద్, వెంకటేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.  

మండలాల వారీగా CMRF లబ్ధిదారుల వివరాలు:  

బాన్సువాడ గ్రామీణ మండలం 6 మంది CMRF లబ్ధిదారులకు రూ.2,03,000  

బాన్సువాడ మున్సిపాలిటీ ఇద్దరు CMRF లబ్ధిదారులకు రూ.34,000  

బీర్కూర్ మండలం ముగ్గురు CMRF లబ్ధిదారులకు రూ.1,12,000  

నసురుల్లాబాద్ మండలం 5 మంది CMRF లబ్ధిదారులకు రూ.1,31,000  

మోస్రా మండలం ముగ్గురు CMRF లబ్ధిదారులకు రూ.60,500  

చందూర్ మండలం 5 మంది CMRF లబ్ధిదారులకు రూ.1,25,500  

వర్ని మండలం 4 మంది CMRF లబ్ధిదారులకు రూ.1,81,000  

రుద్రూర్ మండలం 9 మంది CMRF లబ్ధిదారులకు రూ.2,39,500  

కోటగిరి మండలం నలుగురు CMRF లబ్ధిదారులకు రూ.1,34,000  

పోతంగల్ మండలం ఇద్దరు CMRF లబ్ధిదారులకు రూ.65,500  

మొత్తం నియోజక వర్గంలో 43 మంది CMRF లబ్ధిదారులకు రూ.12,86,000 అందజేశారు.








Post a Comment

Previous Post Next Post