రేపు బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటన
పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రజక సంఘ భవనం ప్రారంభం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రేపు 12.07.2026 ఆదివారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో కార్యక్రమాలు
ఉదయం 9:00 గంటలకు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, శాశ్వత సదరం క్యాంపును ప్రారంభిస్తారు. దీంతో పోలీస్ సిబ్బందికి అక్కడికక్కడే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు, పెన్షన్ల కోసం శాశ్వత సదరం క్యాంపు ఉపయోగపడనుంది.
ఉదయం 9:30 గంటలకు బాన్సువాడ పట్టణంలో బాన్సువాడ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆయన ప్రారంభిస్తారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఇవి మరింత ఉపయోగపడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఉదయం 10:30 గంటలకు కొత్త బాన్సువాడలో రజక సంఘం నూతన భవనంను మంత్రి ప్రారంభించనున్నారు. సామాజిక సంక్షేమానికి, సంఘ సభ్యుల సమావేశాలకు ఈ భవనం ఉపయోగపడుతుంది.

Post a Comment