బాన్సువాడ పట్టణంలో పేకాట
ముగ్గురి అరెస్ట్
10,860 రూపాయలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాన్సువాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం పక్కన కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అంది. సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
వారి వద్ద నుండి నగదు 10,860 రూపాయలు
2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment