Top News

Protest in MCH | మూడో రోజు కూడా కొనసాగిన నిరసనలు

ఎం.సి.హెచ్ బాన్సువాడలో నర్సులకు మద్దతుగా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ ఆందోళన  

మూడో రోజు కూడా కొనసాగిన నిరసనలు

బాన్సువాడ: మాతా శిశు ఆసుపత్రి బాన్సువాడలో సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులకు మద్దతుగా వైద్యులు, వైద్య సిబ్బంది మూడవ రోజు కూడా నిరసన చేపట్టారు. ఈరోజు ఆసుపత్రి ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులు అస్వస్థత కు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దృశ్యం 👆

ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ, బాలింతల కేసులో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడాన్ని, మత్తు మందు వైద్యుడిని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.

"ఒకవేళ తప్పు జరిగితే మొదట మెమో ఇవ్వాలి. నేరుగా సస్పెండ్ చేయడం, తొలగించడం సరికాదు. ఈ చర్యల వల్ల సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుంది" అని వారు అన్నారు.

సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని, తొలగించిన మత్తు వైద్యుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలత, ప్రకాష్, సాయిలు, ప్రవీణ్ తో పాటు పారామెడికల్ సిబ్బంది సాగర్, హిమాయత్, హెడ్ నర్స్ అమృత తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post