ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎల్లారెడ్డిలో అఖిలపక్ష సమావేశం
ఆర్డీఓ అధ్యక్షతన సమగ్ర చర్చ
ఎల్లారెడ్డి: SIR - Special Intensive Revision కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి ఆర్డీఓ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో SIR ప్రక్రియ పురోగతి, ఓటరు జాబితా సవరణలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
SIR ప్రక్రియ పురోగతి
ఆర్డీఓ మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిని B L O యాప్ ద్వారా 100% డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు.పరిశీలనలో 22,283 ఫారాలు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, డబుల్ ఓటర్లుగా గుర్తించామని వివరించారు.
కొత్త పోలింగ్ కేంద్రాలు
CEO తెలంగాణ ఆదేశాల మేరకు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించి కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఆర్డీఓ వెల్లడించారు.
ప్రతిపాదిత కొత్త పోలింగ్ కేంద్రాలు:
గాంధారి: 5
లింగంపేట్: 8
నాగిరెడ్డిపేట్: 1
సదాశివనగర్: 4
ఎల్లారెడ్డి: 2
మండలాల వారీగా వివరాలు:
అన్‌మ్యాప్ ఫారాలు:
ఎల్లారెడ్డి – 998, తాడ్వాయి – 313, నాగిరెడ్డిపేట్ – 576, గాంధారి – 1,316, లింగంపేట్ – 1,096, రామారెడ్డి – 784, రాజంపేట – 253, సదాశివనగర్ – 1,328
మరణించిన ఓటర్లు:
తాడ్వాయి – 969, నాగిరెడ్డిపేట్ – 900, గాంధారి – 1,202, లింగంపేట్ – 1,239, రామారెడ్డి – 655, ఎల్లారెడ్డి – 1,115, రాజంపేట – 341, సదాశివనగర్ – 1,180
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు:
తాడ్వాయి – 1,208, నాగిరెడ్డిపేట్ – 873, గాంధారి – 1,821, లింగంపేట్ – 1,164, రామారెడ్డి – 1,089, ఎల్లారెడ్డి – 1,212, రాజంపేట – 413, సదాశివనగర్ – 1,395
ముఖ్య తేదీలు
ఆగస్టు 10: డ్రాఫ్ట్ ఓటరు జాబితా నోటిఫికేషన్ విడుదల
ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు: క్లెయిమ్స్ & అభ్యంతరాల స్వీకరణ - ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు
అక్టోబర్ 10: తుది ఓటరు జాబితా విడుదల
ఈ సమావేశంలో స్థానిక తహసీల్దార్, గిర్దావర్, ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రజాక్, ఇమ్రాన్, అజర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment