ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100% పూర్తి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందనలు
కామారెడ్డి: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ - SIR కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల - EFS ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు.
గణాంకాలు ఇలా ఉన్నాయి:
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,28,503
డిజిటైజేషన్ పూర్తి చేసిన వారు: 2,06,220 - 90.25%
అందుబాటులో లేని ఫారమ్‌లు: 22,283 - 9.75%
ఫారమ్‌లు అందుబాటులో లేని 22,283 మందిని "అన్‌కలెక్టెడ్ ఫార్మ్స్"గా నమోదు చేయడం ద్వారా మొత్తం 2,28,503 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియను 100% పూర్తి చేశారు.
నిర్దేశిత గడువులో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
ఈ విజయానికి కృషి చేసిన ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు,బీఎల్‌వోలు,సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో నాణ్యతను, పారదర్శకతను కొనసాగిస్తూ భవిష్యత్‌లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
--------------------------------భారీ వర్షాలు, మెరుపుల హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి: రాబోయే రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు:
- వర్షాల సమయంలో నదులు, వాగులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లవద్దు. వరద నీటిని దాటే ప్రయత్నం ప్రమాదకరం.
- చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గర ఉండరాదు.
- మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలి.
- అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. రోడ్లు జారుడుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
- కలుషిత ఆహారం, తాగునీటిని వాడకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- గొర్రెల కాపరులు, పశుపోషకులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
చేపట్టిన చర్యలు:
- జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశారు.
- వరదలు, అత్యవసర పరిస్థితులకు స్పందించేందుకు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు.
- R&B అధికారులు రహదారులను నిరంతరం పర్యవేక్షించాలి.
- పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రత చర్యలు తీసుకోవాలి.
- పంచాయతీరాజ్ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి. "ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి" అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అత్యవసర సంప్రదింపు నంబర్లు
*జిల్లా నియంత్రణ కేంద్రం:* 8468220069
*పోలీస్ కంట్రోల్ రూమ్:* 100
*అగ్నిమాపక శాఖ:* 101
అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే గ్రామ, మండల అధికారులకు లేదా జిల్లా నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


Post a Comment