జాతీయ రహదారులపై ఆక్రమణలు, అతివేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు
హైవే టాస్క్ ఫోర్స్ ద్వారా ఆక్రమణల తొలగింపు
పోలీసులకు స్పీడ్ లేజర్ గన్స్ అందజేతకు సూచన
ఎస్‌ఎస్ నగర్ FOB పనులు 2027 జనవరికి పూర్తి
కామారెడ్డిలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం
కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రత పెంచే లక్ష్యంతో మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ DRSC సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ, జాతీయ రహదారుల అధికారులు, పోలీసు శాఖ, రోడ్లు & భవనాల శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానంగా ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-161 జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణల అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను నూతనంగా ఏర్పాటు చేసిన హైవే టాస్క్ ఫోర్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అతివేగ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. ఇందుకోసం ఎన్‌హెచ్-161 రహదారి అథారిటీ పోలీసు శాఖకు స్పీడ్ లేజర్ గన్స్ అందజేయాలని సూచించారు. వాటి ద్వారా అతివేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఎన్‌హెచ్-161కు సంబంధించిన పలు రహదారి భద్రత సమస్యలను సమావేశంలో చర్చించి, సంబంధిత శాఖలు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎన్‌హెచ్-44లో ఎస్‌ఎస్ నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు 2027 జనవరి నాటికి పూర్తవుతాయని జాతీయ రహదారుల అధికారులు సమావేశంలో తెలిపారు.

2026 జనవరి కాదు 2027 జనవరి 2026 జనవరి తిరిగి వస్తె ఎంత బాగుందో
ReplyDeletePost a Comment